జిల్లాలో 32 క్వారంటైన్ కేంద్రాలు

 మచిలీపట్నం: క‌్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న కరోనా అనుమాతులకు రోజూ డ్రై ఫ్రూట్స్ అందిస్తున్నట్లు మచిలీపట్నం క‌్వారంటైన్‌ కేంద్రం ఇంచార్జి వీసీ విల్సన్ బాబు, ఆర్డీఓ ఖాజావలీ తెలిపారు. గురువారంనాడు మచిలీపట్నంలో క‌రోనా అనుమానితుల‌కు ఆహారం  అంద‌జేశారు. అనంత‌రం వారిద్ద‌రూ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో 32 క్వారంటైన్‌ సెంటర్స్ ఏర్పాటు చేయ‌గా, వీటిలోకి 590 మంది కరోనా అనుమానితులను తరలించామ‌ని తెలిపారు. క్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ వచ్చిన 20 మందిని కోవిడ్‌-19 ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నామ‌న్నారు. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన 137 మందిని హోం క్వారంటైన్‌కు పంపించామ‌ని వెల్ల‌డించారు. ప్రస్తుతం 433 మంది అనుమానితులు క్వారంటైన్‌లో ఉన్నార‌ని పేర్కొన్నారు. (న‌య‌మైన రోగుల‌కు మ‌ళ్లీ క‌రోనా!)